ఆంధ్రా కింగ్ తాలూకాగా రామ్ సినిమా రావడంతో, మరి తెలంగాణ కింగ్ ఎవరా? అన్న చర్చ మొదలైంది. ఈ టైటిల్‌తో సినిమా వస్తే ఏ హీరో పక్కాగా సూట్ అవుతాడని జోరుగా చర్చించుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ
ఆంధ్రా కింగ్ తాలూకాగా రామ్ సినిమా రావడంతో, మరి తెలంగాణ కింగ్ ఎవరా? అన్న చర్చ మొదలైంది. ఈ టైటిల్‌తో సినిమా వస్తే ఏ హీరో పక్కాగా సూట్ అవుతాడని జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టైటిల్‌కి అర్హుడు విజయ్ దేవరకొండ అని అంటున్నారు. విజయ్ తెలంగాణ వాసే. పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతాడు. విజయ్‌కి ఈ యాస బాగా కలిసొచ్చింది. తాను స్టార్‌గా కనెక్ట్ అవ్వడానికి ఆ స్లాంగ్ ప్రధాన కారణం. పెళ్లి చూపులు సినిమాకు కంటెంట్‌తో పాటు విజయ్ స్లాంగ్ వర్కౌట్ అయింది. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి విజయాలతో సూపర్ స్టార్ అయ్యాడు. విజయ్ తర్వాత తెలంగాణ నుంచి ఆ స్థాయిలో సక్సెస్ అయిన మరో నటుడు కూడా లేడు. తెలంగాణ నుంచి హీరో నితిన్ ఉన్నా వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ కింగ్ నే టైటిల్ విజయ్‌కి పర్ఫెక్ట్‌గా సూటవుతుందంటున్నారు.