30 భాషల్లో తెలుగు సినిమా రిలీజ్!

టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం కోవిడ్ సమయంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది.

takshakudu

తక్షకుడు

టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం కోవిడ్ సమయంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాను వినోద్ అనంతోజు డైరెక్ట్ చేయగా దీనికి ఓటీటీలో సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఈసారి ఓ కల్ట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, గతంలో మాదిరే ఈసారి కూడా వీరి కాంబోలో రాబోతున్న చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘తక్షకుడు’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 30 భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడంపై నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేయాలి.. మరికొన్ని సినిమాలు నేరుగా ప్రేక్షకులను అలరించాలి.. అందుకే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం’ అని పేర్కొన్నాడు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్