శ్రీలీలకు డబుల్ బొనాంజా

శ్రీలీలకు డబుల్ బొనాంజా

sreeleela

శ్రీలీల

సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటిస్తున్న పీరియాడికల్ డ్రామా ‘పరాశక్తి’. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. ప్రమోషనల్ కంటెంట్‌తో మరింతగా సినిమాపై చిత్ర బృందం పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. అయితే, ఈ సినిమా విడుదల కాకముందే.. శివకార్తికేయన్, శ్రీలీల మరోసారి జత కట్టేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. శివకార్తికేయన్ దర్శకుడు సిబి చక్రవర్తితో శ్రీలీల చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ డిసెంబర్ 10న చెన్నై శివారు ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాలో ముందుగా రష్మిక మందన్నను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. డేట్స్ కారణంగా రష్మిక తప్పుకోవడంతో, శ్రీలీలను ఫైనల్ చేశారట మేకర్స్. ఇప్పటికే టీమ్‌లో శ్రీలీల జాయిన్ కాగా.. డిసెంబర్ చివర్లో షెడ్యూల్ తర్వాత.. తదుపరి షెడ్యూల్ 2026 పొంగల్ తర్వాత ప్రారంభం కానుందట. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా.. ఒకేసారి రెండు సినిమాలు చేయడం విశేషంగా మారింది.


రేడియో టెక్నాలజీతో పనిచేసే కొత్త ఫోన్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్