బింబిసార, విరూపాక్ష, సార్, భీమ్లా నాయక్ చిత్రాలకు ఒకేసారి సంతకం చేశానని.. కానీ వాటి విడుదల అనుకున్న విధంగా జరగలేదని చెప్పింది సంయుక్త మీనన్.
సంయుక్త మీనన్
బింబిసార, విరూపాక్ష, సార్, భీమ్లా నాయక్ చిత్రాలకు ఒకేసారి సంతకం చేశానని.. కానీ వాటి విడుదల అనుకున్న విధంగా జరగలేదని చెప్పింది సంయుక్త మీనన్. ‘ముందు అనుకున్నది వెనక్కి వెళ్లింది. వెనుక అనుకున్నది ముందుగా రిలీజ్ అయింది. అదే తరహాలో ఇప్పుడు కూడా జరుగుతుంద’ని తెలిపింది. స్వయంభూ, నారీ నారీ నడుమ మురారీ, అఖండ-2 తో పాటు పూరి జగన్నాథ్ సినిమాలకు ఒకేసారి సంతకం చేసానంది. కానీ స్వయంభూ, నారీ నారీ నడుమ మురారీ ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉన్నా, వాటికంటే ముందే అఖండ 2 రిలీజ్ అవుతోందని చెప్పింది. ‘నా ప్రణాళిక కంటే దేవుడి ప్రణాళికగా అవి రిలీజ్ అవుతున్నాయనిపిస్తుంది. ఇలా సాగడమే మేలు అని అనిపిస్తుంది. దైవాన్ని మించి ఏదీ లేదు. అలా జరిగితే సంతోషమే కదా’ అని చెప్పుకొచ్చింది. అటు.. 2026లో సంయుక్త మీనన్ నుంచి వరుసగా సినిమాలు విడుదల కానున్నాయి