మెగా హీరోతో ప్రభాస్ కజిన్ సినిమా

సాయి దుర్గా తేజ్ తన తదుపరి సినిమాను సిద్ధార్థ్ రాజ్ కుమార్ అనే కొత్త దర్శకుడితో చేయబోతున్నాడు. ఈ సిద్ధార్థ్ ఎవరో కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ కజిన్.

sai dharam tej

సాయి దుర్గా తేజ్

సాయి దుర్గా తేజ్ తన తదుపరి సినిమాను సిద్ధార్థ్ రాజ్ కుమార్ అనే కొత్త దర్శకుడితో చేయబోతున్నాడు. ఈ సిద్ధార్థ్ ఎవరో కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ కజిన్. గతంలో నటుడిగా పరిచయమైన సిద్ధార్థ్, ఇప్పుడు మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గా మారబోతున్నాడు. ప్రభాస్ ఫ్యామిలీ నుంచి డైరెక్షన్ వైపు వస్తున్న మొదటి వ్యక్తి కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా జానర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉండబోతోంది. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది. సుప్రీం హీరోని మనం ఈ మధ్య ఎక్కువగా సీరియస్ రోల్స్ లో చూస్తున్నాం. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ లవర్ బాయ్ గా మారి, వింటేజ్ తేజ్ ని గుర్తుచేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ కథలో లవ్, ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయట. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే సెట్స్ పైకి వెళ్ళదు. దీనికి ఇంకా చాలా సమయం ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 2026 మార్చిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈలోపు తేజ్ చేతిలో ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుంటారు. సిద్ధార్థ్ కూడా స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్