డైరెక్టర్ శివ నిర్వాణ, టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో కలిసి సినిమా చేయబోతున్నాడు. థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
రవితేజ
డైరెక్టర్ శివ నిర్వాణ, టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో కలిసి సినిమా చేయబోతున్నాడు. థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ ఈ చిత్రానికి ఇరుముడి టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే తండ్రి చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందని ఇన్‌సైడ్ టాక్. అంతేకాదు ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా ఫైనల్ కాగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నాడు.