ఏఐ దుర్వినియోగంపై రష్మిక మందన్నా ఫైర్ అయ్యింది. తన ఎక్స్ ఖాతా ద్వారా..‘మహిళలను లక్ష్యంగా చేసుకొని ఏఐని ఉపయోగిస్తూ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుండడం కొంతమంది వ్యక్తులలో నైతిక క్షీణతను సూచిస్తోంది.
రష్మిక మందన్నా
ఏఐ దుర్వినియోగంపై రష్మిక మందన్నా ఫైర్ అయ్యింది. తన ఎక్స్ ఖాతా ద్వారా..‘మహిళలను లక్ష్యంగా చేసుకొని ఏఐని ఉపయోగిస్తూ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుండడం కొంతమంది వ్యక్తులలో నైతిక క్షీణతను సూచిస్తోంది. నిజానికి ఇంటర్నెట్ ప్రతిబింబం లాంటిది కాదని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా వక్రీకరించగలిగే కాన్వాస్ ఇది. గౌరవప్రదమైన మెరుగైన సమాజం కోసం మాత్రమే ఏఐ ను వినియోగిద్దాం. నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి బాధ్యతగా వ్యవహరిద్దాము. ఇక నిజాన్ని తయారు చేయగలిగినప్పుడే విచక్షణే మనకు గొప్ప రక్షణగా మారుతుంది’ అంటూ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించే వారిని ఉద్దేశిస్తూ రష్మిక ఈ పోస్ట్ పెట్టింది. ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏఐ ను తప్పుదోవ పట్టిస్తూ వ్యక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిని.. మనుషుల్లాగా ప్రవర్తించని వారిని కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేసింది.