క్షమించండి: రణ్‌వీర్ సింగ్

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కాంతార చాప్టర్ 1”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా మొదటి సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా డివోషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.

ranveer singh

ప్రతీకాత్మక చిత్రం

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కాంతార చాప్టర్ 1”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా మొదటి సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా డివోషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మెయిన్ గా ఈ సినిమాలో రిషబ్ శెట్టి పెర్ఫామెన్స్ తోనే దుమ్ము లేపగా ఈసారి కూడా అవార్డులు తనకే వస్తాయని అంతా భావించారు. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో చేసిన నటనను ఇమిటేట్ చేస్తూ స్టేజ్ పై చూపించిన నటన పట్ల తీవ్రమైన విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. రిషబ్ శెట్టి పోషించిన క్లైమాక్స్ వేరియేషన్ ని రణ్‌వీర్ సింగ్ అవమానపరిచాడు అని అతను క్షమాపణలు చెప్పాలంటూ పోస్ట్స్ చేశారు. ఇక దీనిపై అతడు స్పందించాడు. తాను ఒక నటుడిగా మరో నటుడు చేసిన పెర్ఫామెన్స్ ని హైలైట్ చెయ్యాలనే రిషబ్ శెట్టి నటన కోసం మాత్రమే చేసానని, దేశంలో ఉన్న ప్రతి సంప్రదాయం, ఆచారాలు అంటే తనకి గౌరవం అని, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే తాను క్షమాపణ కోరుతున్నానని తెలిపాడు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్