ఇతరుల జీవితాలతో ఆడుకోవడం అలవాటు - రకుల్

వివాహం తర్వాత తన భర్త గురించి వచ్చిన రూమర్స్‌పై తాజాగా రకుల్ స్పందించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను సృష్టిస్తూ ఇతరుల జీవితాలతో ఆడుకోవడం అలవాటైపోయింది అంటూ ట్రోలర్స్‌పై మండిపడింది.

rakul preet

రకుల్ ప్రీత్ సింగ్

వివాహం తర్వాత తన భర్త గురించి వచ్చిన రూమర్స్‌పై తాజాగా రకుల్ స్పందించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను సృష్టిస్తూ ఇతరుల జీవితాలతో ఆడుకోవడం అలవాటైపోయింది అంటూ ట్రోలర్స్‌పై మండిపడింది. ఇండస్ట్రీలో ఒడిదుడుకులు సహజమని చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్.. దివాలా తీసారని, కంపెనీ మూసేశారనే వార్తలపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘క్లిక్స్ కోసం ఏమైనా రాసే సంస్కృతికి ప్రజలు అలవాటు పడ్డారు. వాస్తవానికి, తప్పుడు వార్తలకు చాలా వ్యత్యాసం ఉంది. నిజానిజాలు నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను వాటిని పట్టించుకోలేదు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో భాగమైనప్పుడు కొన్ని విషయాల గురించి మౌనంగా ఉండటమే మంచిది. సమయం వచ్చినప్పుడు అసలు నిజం ఏమిటి అన్నది ప్రజలకే తెలుస్తుంది. జాకీ భగ్నానీపై వార్తలు వచ్చినప్పుడు అతడు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నాడో నాకు మాత్రమే తెలుసు. కంపెనీ మూసేసారని రాశారు. ఇతరుల జీవితాలతో ఆడుకోవడం కొంతమందికి అలవాటైపోయింది. అందుకే నిజానిజాలు తెలుసుకోకుండా ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురితం చేస్తున్నారు’ అని మండిపడింది.


ధనాధన్.. దంచేద్దాం... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా సంసిద్ధం...
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్