రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలకు దూరమై నాలుగేళ్లవుతుంది. కొండపొలం తర్వాత అమ్మడు పూర్తిగా హిందీకే పరిమితమైంది. అక్కడ అవకాశాలకు కొదవలేదు.
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలకు దూరమై నాలుగేళ్లవుతుంది. కొండపొలం తర్వాత అమ్మడు పూర్తిగా హిందీకే పరిమితమైంది. అక్కడ అవకాశాలకు కొదవలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయాణం సాగిస్తుంది. హిట్లు కంటే ప్లాపు లే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి నటిగానైనా మార్క్ వేసిందా? అంటే! ఆ రేంజ్ పెర్పార్మెన్స్ ఏ సినిమాలోనూ ఇవ్వలేదు. ఖాళీ లేకుండా సినిమాలు చేస్తుందనే మాట తప్ప? అంతకు మించి ఇప్పటి వరకూ హిందీలో రకుల్ సాధించింది ఏం లేదు. గత ఏడాది దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నిర్మాత జాగీభగ్నానీ తో ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెట్టి స్టాప్ పెట్టి ఓ ఇంటిదైంది. సాధారణంగా వివాహమైతే జీవితంలో కొత్తగా మార్పులొస్తాయంటారు. కెరీర్ మరింత గొప్పగా మారుతుందని అంటారు. కానీ రకుల్ విషయంలో అలాంటి అద్భుతాలేవి జరగలేదు. కేవలం ఛాన్సులు అందుకోవడం వరకే పరిమితమైంది తప్ప! సక్సెస్ కు మాత్రం ఇంకా దూరంలోనే ఉంది. 2026 ఫిబ్రవరికి రకుల్ కి పెళ్లై రెండేళ్లు పూర్తవుతుంది. మరి ఈ శుభ సందర్బంలో కొత్త మార్పు ఏదైనా చోటు చేసుకుంటుందేమో చూడాలి.