నటుడు రాజశేఖర్‌కు ప్రమాదం

నటుడు రాజశేఖర్ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. ఓ తమిళ రీమేక్ చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిసింది.

rajesekhar

రాజశేఖర్‌

హైదరాబాద్, డిసెంబర్ 8 (ఈవార్తలు): నటుడు రాజశేఖర్ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. ఓ తమిళ రీమేక్ చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిసింది. వివరాల్లోకి వెళితే, రాజశేఖర్ తమిళంలో విజయవంతమైన 'లబ్బర్ పందు' రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఆయన కాలి చీలమండకు గాయమైంది. పరీక్షించిన వైద్యులు చీలమండలో క్రాక్స్ ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు. అనంతరం నాలుగు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. రాజశేఖర్‌కు గాయం కావడంతో సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చిత్రీకరణను తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా, రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్‌గా కనిపించనుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణ ఈ సినిమాలో రాజశేఖర్‌కు జోడీగా నటిస్తోంది.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్