ఇష్టమొచ్చినట్లు వస్తే నో ఎంట్రీ: రాజమౌళి

ఇష్టమొచ్చినట్లు వస్తే నో ఎంట్రీ: రాజమౌళి

S. S. Rajamouli

ఎస్. ఎస్. రాజమౌళి

మహేశ్ బాబు, రాజమౌళి ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29 సినిమా కోసం 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌ను చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ ఈవెంట్ కోసం సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతోంది. కానీ, సరిగ్గా ఈ టైమ్‌లో డైరెక్టర్ రాజమౌళి స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేసి, కొన్ని రూల్స్ చెప్పారు. ముఖ్యంగా, ఫ్యాన్స్ చేసే చిన్న పొరపాటు వల్ల ఈవెంట్ మొత్తం క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉందని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ‘ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. దయచేసి ఎవరూ పాస్ లేకుండా రావద్దు. సోషల్ మీడియాలో కొందరు ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరైనా రావచ్చు అని, చెప్తున్నారు. అలా వచ్చే ఫేక్ న్యూస్‌ను అస్సలు నమ్మకండి కేవలం 'ఫిజికల్ పాస్' చేతిలో ఉన్న వాళ్లను మాత్రమే లోపలికి అనుమతిస్తాం, ఈవెంట్‌కు వస్తున్న ప్రతీ ఒక్కరూ తమ పాస్‌ను వెంట తెచ్చుకోవడం తప్పనిసరి’ అని అన్నారు. ఈ ఈవెంట్‌కు కొన్ని కఠినమైన వయోపరిమితులు కూడా పెట్టారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు, అలాగే సీనియర్ సిటిజన్లకు (పెద్ద వయసు వారికి) పోలీస్ శాఖ అనుమతి నిరాకరించిందని, వాళ్లందరూ తమ భద్రత దృష్ట్యా ఇంట్లోనే ఉండాలని, ఈవెంట్‌ను జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడాలని కోరారు.


కెప్టెన్సీ ఇస్తేనే రాజస్థాన్‌కు!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్