Pushpa 2 Peelings Song | వారెవ్వా.. పీలింగ్స్ సాంగ్‌లో దుమ్ము రేపిన అల్లు అర్జున్ రష్మిక మందన్నా

Pushpa 2 Peelings Song | డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప 2 సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన పీలింగ్స్ లిరికల్ సాంగ్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా చేసిన డ్యాన్స్ ఉర్రూతలూగిస్తోంది.

pushpa 2 peelings

పుష్ప 2 పీలింగ్స్ సాంగ్

Pushpa 2 Peelings Song | డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప 2 సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన పీలింగ్స్ లిరికల్ సాంగ్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా చేసిన డ్యాన్స్ ఉర్రూతలూగిస్తోంది. ఈ సాంగ్‌లో ప్రతీ షాట్‌లో బన్నీ, రష్మిక పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ఈ సాంగ్ చూస్తున్నంతసేపు వింటేజ్ అల్లు అర్జున్‌ను చూస్తున్నట్లే అనిపించిందంటే ఏ రేంజ్‌లో బన్నీ డ్యాన్స్ ఇరగదీసాడో అర్థం అవుతుంది. డ్యాన్స్‌లో తాను ఎందుకు స్పెషలో మరోసారి నిరూపించాడు. రేసుగుర్రం సినిమాలో బన్నీతో పోటీగా శ్రుతిహాసన్ డ్యాన్స్ చేయగా.. ఆ తర్వాత పుష్ప 2 సినిమాలో రష్మిక చాలా కష్టపడిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించాడు.

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 ది రూల్ ఈ నెల 5న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన కిస్సిక్ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. ఆ సాంగ్‌లోనూ బన్నీతో పోటాపోటీగా శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తన అందాలను ప్రదర్శిస్తూనే బన్నీతో స్టెప్పులను కలిపింది. డీఎస్పీ సంగీత దర్శకుడిగా మరోసారి తన మార్క్ చూపించాడు. 

 


2026లో 27 సాధారణ సెలవులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్