ప్రస్తుతం ప్రియాంక చోప్రాతో జక్కన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసుకుంటున్నాడు. జక్కన్న మాటకు కట్టుబడి ఆమె కూడా పని చేస్తోంది.
ప్రియాంక చోప్రా
ప్రస్తుతం ప్రియాంక చోప్రాతో జక్కన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసుకుంటున్నాడు. జక్కన్న మాటకు కట్టుబడి ఆమె కూడా పని చేస్తోంది. చెప్పిన టైమ్ కి షూటింగ్ కి వస్తోంది. షూటింగ్ కాస్త ఆలస్యమైనా అడ్జస్ట్ అవుతోంది. ఎక్కడా పనిగంటల గురించి మాట్లాడలేదు. అగ్రిమెంట్ ప్రకారం పారితోషికం తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు టీమ్‌తో మింగిల్ అవుతోంది. ఇవన్నీ గమనించిన కల్కి మేకర్స్ లో ప్రియాంకను మించిన ఉత్తమ నటి ఎవరుంటారు? అన్న ఆలోచన మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది. కల్కీ 2 కంటే ముందుగా వారణిసి రిలీజ్ అవుతుంది. ప్రియాంకను తీసుకుంటే గనుక ఆ హిట్ కల్కి 2 కి కలిసొస్తుంది. మార్కెట్ పరంగానూ మరింత మెరుగ్గా ఉంటుంది.