పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు రూ.160 కోట్లకు లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. డీల్ అఫీషియల్‌గానే ముగించుకున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
స్పిరిట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు రూ.160 కోట్లకు లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. డీల్ అఫీషియల్‌గానే ముగించుకున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. స్పిరిట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఓవైపు ప్రభాస్ యాక్ట్ చేస్తుండడం.. మరోవైపు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తుండడంతో ఓ రేంజ్ లో హోప్స్ ఉన్నాయి. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని.. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని అంతా ఫిక్స్ అయిపోయారు. అలాంటి అంచనాలు ఉన్న మూవీకి రూ.160 కోట్లకే ఓటీటీ డీల్ ఖరారు అయిందంటే నమ్మలేకపోతున్నామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. ఓ విధంగా అది కూడా నిజమే.. రీసెంట్ గా వచ్చిన కొన్ని భారీ చిత్రాలకు పెద్ద మొత్తంలో డీల్స్ ఖరారు అయ్యాయి. ఓటీటీ ఒప్పందాలతోనే మేకర్స్‌కు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ కేవలం హిందీ ఓటీటీ రైట్సే రూ.170 కోట్లకు పైగా రేట్‌తో అమ్ముడయ్యాయి. అలాంటిది స్పిరిట్ మూవీకి మొత్తం డీల్ రూ.160 కోట్లకు ఖరారు అవ్వడమంటే నమ్మేలా లేదని కామెంట్లు పెడుతున్నారు.