సమంత రెండో పెళ్లి పై ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సమంత ఒక అహంకారి అని, సొంత గూటిని నిలబెట్టుకోవడానికి ఇతరుల కొంప కూల్చుతుంది అంటూ చేసిన కామెంట్ లు సంచలనం సృష్టిస్తున్నాయి.
పూనమ్ కౌర్
సమంత రెండో పెళ్లి పై ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సమంత ఒక అహంకారి అని, సొంత గూటిని నిలబెట్టుకోవడానికి ఇతరుల కొంప కూల్చుతుంది అంటూ చేసిన కామెంట్ లు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. గత రెండు మూడు సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో రూమర్డ్ జంటగా కొనసాగుతున్న సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అటు సమంత తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన ఏడాది తర్వాత రాజ్ కూడా తన భార్య శ్యామలీకి విడాకులు ఇచ్చారు. అప్పట్లో ఈ విషయం కూడా సంచలనం సృష్టించింది. ఇక వీరిద్దరూ ఎక్కడపడితే అక్కడ చట్టపట్టలేసుకొని తిరుగుతుంటే రాజ్ భార్య కూడా ఇండైరెక్టుగా వీరి బంధాన్ని వివరిస్తూ.. పోస్టులు పెడుతూ వార్తల్లో నిలిచింది. నిజంగానే రాజ్, సమంత పెళ్లి చేసుకోవడంతో పూనమ్ కౌర్ మాత్రం తన ఎక్స్ ఖాతా ద్వారా సంచలన పోస్ట్ పెట్టింది. పూనం కౌర్ తన ఎక్స్ ఖాతా ద్వారా..‘సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం చాలా బాధాకరం. బలహీనమైన, నిస్సహాయ పురుషులను డబ్బుతో కొనుగోలు చేయవచ్చు. ఈ అహంకార పూరిత మహిళను పెయిడ్ పీ ఆర్ టీమ్ చాలా గొప్ప వారిగా చూపిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.