ఒంపుసొంపులతో కోట్లు కొల్లగొడుతోంది!

బుట్టబొమ్మ పూజాహెగ్డే కొంత కాలంగా సినిమాలు లేక ఇబ్బందులు పడుతోంది. అయితే, సినిమాలు లేకపోయినా తనకు స్పెషల్ సాంగ్స్ ఉన్నాయంటూ దూసుకెళ్తోంది.

pooja hegde

 పూజాహెగ్డే 

బుట్టబొమ్మ పూజాహెగ్డే కొంత కాలంగా సినిమాలు లేక ఇబ్బందులు పడుతోంది. అయితే, సినిమాలు లేకపోయినా తనకు స్పెషల్ సాంగ్స్ ఉన్నాయంటూ దూసుకెళ్తోంది. ‘కూలీ’ సినిమాలో ‘మౌనిక’ సాంగ్ విజయంతో పూజా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆమె డాన్స్‌, లుక్స్‌, గ్లామర్ ఆ పాటను దక్షిణాది వ్యాప్తంగా వైరల్ చేశాయి. ఈ సాంగ్ హిట్ తర్వాత పూజాకు స్పెషల్ సాంగ్ ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌లోని ప్రత్యేక గీతం కోసం పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ కోసం ఆమెకు రూ.5 కోట్లు పారితోషికం ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక ఐటం సాంగ్‌కు ఇది భారీ రెమ్యునరేషన్. దీంతో సినిమాల కంటే ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్‌లపైనే దృష్టి పెడుతోంది.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్