‘పీఆర్ టీం లేదు’ అంటూ శ్యామలీ దే కౌంటర్

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఇన్ని రోజులు రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకుని.. ఇప్పుడు ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

Shyamali  counter to rumours

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఇన్ని రోజులు రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకుని.. ఇప్పుడు ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సమంత , నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. ఏడాదికి రాజ్ కూడా తన భార్య శ్యామలీ దేకి విడాకులు ఇచ్చారు. అప్పట్లో ఈ విషయాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి గురించి శ్యామలీ నేరుగా స్పందించలేదు కానీ తాజాగా పంచుకున్న ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో.. ‘ఇప్పుడు ఎవరైనా డ్రామా అలాగే బ్రేకింగ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానిని మీరు ఇక్కడ ఎప్పటికీ కనుగొనలేరు. దయచేసి ఇలాంటి వాటికోసం వెతక కండి. ముఖ్యంగా అలా బ్రేకింగ్ కోసం ఎదురు చూసేవారు దయచేసి నా ఇంస్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేయకపోవడమే మంచిది. శ్రద్ధ, మీడియా కవరేజ్, ప్రత్యేక ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు లాంటివి చేయడం లేదు. ముఖ్యంగా సానుభూతి కోసం అస్సలు చూడడం లేదు. ఇక ఎవరినైనా నిందించడానికి కూడా ఇక్కడ ప్రయత్నం చేయడం లేదు’ అంటూ రూమర్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నవారికి ఇన్ డైరెక్ట్ గా గట్టి కౌంటర్ ఇచ్చింది శ్యామలీ.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్