ఆ తప్పు వెంటాడుతోంది: నయనతార

సినీ కెరియర్లో తాను చేసిన తప్పులు, పొరపాట్ల గురించి చెబుతూ నయనతార ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో భాగంగా తన కెరియర్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు గడిచిపోయాయి.

nayanthara

నయనతార

సినీ కెరియర్లో తాను చేసిన తప్పులు, పొరపాట్ల గురించి చెబుతూ నయనతార ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో భాగంగా తన కెరియర్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించాను. ఆ హీరోలతో నటించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు కూడా చేస్తూ వచ్చాను. అందులో నటన గురించి మెలకువలు నేర్చుకోవడంలో చేసిన పొరపాట్లు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఒకసారి ఒక సినిమా షూటింగ్లో మోహన్ లాల్ గారితో నటించినప్పుడు నా పాత్రకు చాలా డైలాగులు ఉండేవి. అయితే ఆ డైలాగులకు తగ్గట్టుగా హావాభావాలను పలికించేందుకు తెగ కష్టపడి పోయాను. మోహన్ లాల్ బాగా హావభావాలు పలకాలి అని నాతో చెప్పారు. ఇక పదేపదే చెబుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక తెగ కంగారు పడిపోయాను. అయితే నా పరిస్థితిని అర్థం చేసుకున్న డైరెక్టర్ అక్కడికి వచ్చి ఈ రోజుకు చాలు.. రేపు ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం అని చెప్పి నన్ను రక్షించారు. ఇంటికి వెళ్ళాక కూడా మరునాడు చేయబోయే సీన్ల కోసం రాత్రంతా రిహార్సల్స్ చేశాను. మరుసటి రోజు షూటింగ్ సెట్లో అందరూ అనుకున్నట్టుగానే నటించాను. షాట్ చాలా బాగా వచ్చింది. ఇక నన్ను అందరూ మెచ్చుకున్నారు’ అని తెలిపింది. 


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్