నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దసరా తర్వాత ఇద్దరు మరోసారి చేతులు కలిపారు.
ప్యారడైజ్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దసరా తర్వాత ఇద్దరు మరోసారి చేతులు కలిపారు. ఇదీ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. దసరా కు రెండితలు యాక్షన్ ప్యారడైజ్ లో ఉంటుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. సినిమాలో నాని జడల్ అనే పవర్ పుల్ రా రస్టిక్ పాత్రలో కనిపిస్తాడు. తాజాగా హైదరాబాద్లో ఓ భారీ సెట్ లో యాక్షన్ సన్ని వేశం చిత్రీక రిస్తున్నారు. నాని-రాఘవ్ తో పాటు కొందరు ఫైటర్లు ఈ యాక్షన్ సీన్ లో పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇంత వరకూ ఈ రేంజ్ యాక్షన్ సన్నివేశం ఏ హీరో, ఏ సినిమాలో చేయలేదని.. ఎంతో క్రియేటివ్ గా యాక్షన్ సన్నివేశం డిజైన్ చేసినట్లు స్టంట్ మాస్టర్లు చెబుతున్నారు.