ఐబొమ్మ రవి రాబిన్‌హుడ్: నాగవంశీ

ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో మాత్రం రవికి ఊహించని విధంగా మద్దతు లభిస్తోందని ప్రొడ్యూసర్ నాగవంశీ అన్నాడు.

naga vamsi

నాగవంశీ

ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో మాత్రం రవికి ఊహించని విధంగా మద్దతు లభిస్తోందని ప్రొడ్యూసర్ నాగవంశీ అన్నాడు. 90స్ లో ఉండే మ్యాజిక్ ను ప్రస్తుత జనరేషన్ వాళ్ళు మిస్ అవ్వడానికి కారణం డిజిటలైజేషన్ అని భావిస్తున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. వెంటనే సోషల్ మీడియా అని నాగవంశీ వేదికపై వ్యాఖ్యానించారు. ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్‌ను చేసిన లోకంలో మనం ఉన్నామని తెలిపారు. అలాంటిది 90స్ తో ఎలా పోలికలు పెడతారని క్వశ్చన్ చేశారు. అతడేమో అందరికీ రాబిన్ హుడ్ అయిపోయాడని అన్నారు. రూ.50 టికెట్ రేట్లు పెంచితే తామేదో తప్పు చేసిన వాళ్లం అయిపోయామని వ్యాఖ్యానించారు. ఆ అబ్బాయి హీరో అయిపోయాడని, అలాంటి సొసైటీలో ఉంటూ తప్పు ఏం జరిగిందని అడుగుతారు ఏంటండీ.. అంటూ నాగవంశీ సెటైరికల్‌గా మాట్లాడారు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్