‘శశిరేఖ’ ప్యూర్ క్లాసీ!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్’ చిత్రం నుంచి రెండో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘శశిరేఖ’ పేరుతో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

sashirekha song

ప్రతీకాత్మక చిత్రం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్’ చిత్రం నుంచి రెండో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘శశిరేఖ’ పేరుతో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను సింగర్ మధుప్రియతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌ పాడారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట అయిన ‘మీసాల పిల్ల’ భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం తదుపరి పాట విడుదల చేయడం.. ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం చిత్రబృందంలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌. 2026 సంక్రాంతికి విడుదల కానుంది.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్