చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో చాలా రకాల విమర్శలు, నెగిటివిటీ ఫేస్ చేశానని అన్నది కృతి శెట్టి. అంతేకాదు తన పరంగా బెస్ట్ ఇస్తున్నా సరే ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటున్నా అన్నది కృతి. ఈ టైంలో తన మదర్ సపోర్ట్ గా ఉన్నారని స్నేహితులు కూడా సపోర్ట్ చేశారని ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది కృతి శెట్టి.
కృతి శెట్టి
చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో చాలా రకాల విమర్శలు, నెగిటివిటీ ఫేస్ చేశానని అన్నది కృతి శెట్టి. అంతేకాదు తన పరంగా బెస్ట్ ఇస్తున్నా సరే ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటున్నా అన్నది కృతి. ఈ టైంలో తన మదర్ సపోర్ట్ గా ఉన్నారని స్నేహితులు కూడా సపోర్ట్ చేశారని ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది కృతి శెట్టి. ఉప్పెన తర్వాత సినిమాలు ఆపేద్దామనుకున్నా అని చెప్పుకొచ్చింది. అంతేకాదు తను ఎమోషనల్ అవుతూ చిన్న బ్రేక్ అవసరం అనుకుంటా అని అన్నది కృతి. తొలి సినిమా సక్సెస్ పడ్డాక ఆ ఇంపాక్ట్ వల్ల నెక్స్ట్ ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందో తెలిసిందే. కథల జడ్జిమెంట్ కరెక్ట్ గానే అనిపిస్తాయి కానీ రిజల్ట్ వేరేలా ఉంటుంది. కృతి శెట్టి విషయంలో అలానే జరిగింది. ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు ఈ సినిమాలు తప్ప నెక్స్ట్ వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. అందుకే అమ్మడు ఇప్పుడు కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు. తమిళ్ లో రవి మోహన్ తో జినీ, ప్రదీప్ రంగనాథన్ తో సినిమాలు చేసిన కృతి శెట్టి కార్తితో అన్న గారు వస్తున్నారు సినిమాలో కూడా నటించింది.
చైతూ నిజాయతీపరుడు
మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన వాళ్లలో మీకు ఎక్కువ కంఫర్టబుల్ గా అనిపించేది ఎవరితో అని అడగ్గా వెంటనే.. కృతి శెట్టి నాగచైతన్య పేరు చెప్పింది. నాగచైతన్య చాలా నిజాయితీపరుడని, ఆయనెప్పుడూ ఎలాంటి ఫిల్టర్లు లేకుండా చాలా హానెస్ట్ గా ఉంటారనిపిస్తుందని, కృతి తెలిపింది. ఇప్పటికే చైతన్య మంచితనం గురించి ఎంతో మంది పలు సందర్భాల్లో మాట్లాడగా, ఇప్పుడు కృతి కూడా ఈ అక్కినేని హీరోకు మంచి సర్టిఫికెట్ ఇచ్చింది