చెమటోడుస్తున్న కాయదు లోహార్
కాయదు లోహార్
కన్నడ హీరోయిన్‌గా పరిచయం అయిన కాయదు లోహార్.. మలయాళం, తెలుగు సినిమాల్లోనూ నటించింది. తెలుగులో ఈమె చేసిన అల్లూరి సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. దాంతో కయాదు లోహర్ కెరీర్ పరంగా మళ్లీ పుంజుకోవడం కష్టమే అని ఆమె సన్నిహితులే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ ఏడాదిలో ఆమె నటించిన డ్రాగన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా పరిస్థితులను మార్చేసింది. తమిళ్, తెలుగులో ఆమె బిజీ అయ్యే విధంగా డ్రాగన్ మూవీ హిట్ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఏకంగా 6 సినిమాలు ఉన్నాయి. అందులో ఒక తెలుగు సినిమా కూడా ఉంది. రాబోయే రోజుల్లో కాయదు మోస్ట్ వాంటెడ్, పాపులర్ హీరోయిన్‌గా నిలవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే.. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రైనర్ సమక్షంలో బాక్సింగ్ ట్రైనింగ్ అవుతోంది. ఫిజిక్‌ను మరింత నాజూగ్గా మార్చుకొనేందుకే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోందని తెలుస్తోంది.