స్టార్ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వా వాతియార్. తెలుగులో ఈ చిత్రం అన్నగారు వస్తారు అనే పేరుతో విడుదల కాబోతుంది.
అన్నగారు వస్తారు
స్టార్ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వా వాతియార్. తెలుగులో ఈ చిత్రం అన్నగారు వస్తారు అనే పేరుతో విడుదల కాబోతుంది. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్, రాజ్‌కిరణ్, జిఎం సుందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాను డిసెంబర్ 12న తమిళంతో పాటు తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో కార్తీ పోలీస్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కార్తీ సర్థార్ 2ని కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాడు.