పెళ్లికీ ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్

పెళ్లికీ ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్

kajol

కాజోల్

పెళ్లిపై సీనియ‌ర్ న‌టి కాజోల్ బోల్డ్ కామెంట్స్ చేశారు. ఆమె అభిప్రాయం ఇప్పుడు హెడ్ లైన్‌గా మారింది. పెళ్లికి ఒక ముగింపు తేదీ ఉండాల‌నేది కాజోల్ అంటున్న మాట. దానివ‌ల్ల గ‌డువు తేదీ కంటే ఎక్కువ కాలం పెళ్ల‌యిన‌ జంట బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దని వ్యాఖ్యానించారు. అయితే ట్వింకిల్ ఖ‌న్నా దీనికి భిన్న‌మైన వాద‌న వినిపించారు. ‘ఇది వివాహం.. వాషింగ్ మెషీన్ కాదు’ అని కాజోల్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. ట్వింకిల్ ఖన్నా- కాజోల్ ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ షోలో పెళ్లిపై డిబేట్‌లో ఈ సీనియ‌ర్ భామ‌లు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసారు. పెళ్లికి ఒక వ్య‌వ‌ధి ఉంటే, ఆ త‌ర్వాత ఇబ్బందులు ఉండ‌వు అనే అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ కాజోల్ స్వ‌రంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. సీనియ‌ర్ న‌టి అభిప్రాయంతో చాలా మంది విభేధించారు. ఈ షోలో విక్కీ కౌశల్ - కృతిసనన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. షోలో పెళ్లి గురించిన ప్ర‌శ్న‌ల‌కు విక్కీ, కృతి కూడా స్పందించారు.


రేడియో టెక్నాలజీతో పనిచేసే కొత్త ఫోన్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్