మీడియాపై జాన్వీ రుసరుస

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర మరణ వార్తలను కొన్ని మీడియా వర్గాల వారు ప్రముఖంగా ప్రచారం చేశాయి. అందులో ఆయనకి సంబంధించిన కొన్ని తప్పుడు విషయాలను మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేశారు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి ఆరోపణ.

janhvi  kapoor

జాన్వీ కపూర్ 

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర  మరణ వార్తలను కొన్ని మీడియా వర్గాల వారు ప్రముఖంగా ప్రచారం చేశాయి. అందులో ఆయనకి సంబంధించిన కొన్ని తప్పుడు విషయాలను మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేశారు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి ఆరోపణ. తాజాగా జాన్వీ కపూర్ అదే విషయాన్ని లేవనెత్తింది. తన తల్లి శ్రీదేవి చనిపోయిన సమయంలో తప్పుడు వార్తలతో జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు, ఇప్పుడు అదే విధంగా ధర్మేంద్ర గారు చనిపోయిన విషయంలోనూ మీడియా తప్పుడు వార్తలను వండి వడ్డించే ప్రయత్నాలు చేస్తుందని జాన్వీ కపూర్ ఆరోపించింది. ఒకవైపు వ్యక్తి చనిపోయిన బాధలో కుటుంబం ఉంటే మరోవైపు మీడియాలో వచ్చిన కథనాలతో వారు తీవ్ర ఆవేదనకి గురవుతున్నారని జాన్వీ తన ఆవేదనని వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఎవరికి తోచిన విధంగా వారు చనిపోయిన వారి గురించి మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆమె సీరియస్ గా కామెంట్ చేసింది. జాన్వీ కపూర్ ఇంకా మాట్లాడుతూ.. నా తొలి సినిమా విడుదల కాకముందే అమ్మ చనిపోయింది. ఆమె గురించి సినిమా ప్రమోషన్ సమయంలో మాట్లాడినా కూడా కొందరు విమర్శించారు. ఆ ట్రోల్స్ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. నేను ఇండస్ట్రీలోకి రావడానికి కొన్ని నెలల ముందు అమ్మ చనిపోవడంతో ఆమె గురించి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకున్నా, దాన్నీ కొందరు తప్పుపడుతూ విమర్శలు చేయడం చాలా బాధగా అనిపించింది’ అని ఆవేదన వ్యక్తం చేసింది.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్