సుడిగాలి సుధీర్ గోట్ టీజర్ రిలీజ్

జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం గోట్. సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రికెట్ నేపథ్యంతో కామెడీ ప్రధానంగా రూపొందింది.

goat teaser

గోట్ టీజర్ 

జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం గోట్. సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రికెట్ నేపథ్యంతో కామెడీ ప్రధానంగా రూపొందింది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించగా, తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, టీజర్ లాంచ్ చేసిన దిల్ రాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని బాధ్యతాయుతంగా రూపొందించామని, మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా, కొత్త టీమ్‌తో తాము అనుకున్న కథను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఈ సినిమా మాస్ ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు ‘ఫుల్ మీల్స్’లా ఉంటుందని, అలాగే సమాజంలోని ఒక సమస్యను కూడా ప్రస్తావించామని ఆయన వివరించారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు. హీరోయిన్ దివ్యభారతి మాట్లాడుతూ, తమిళంలో ‘బ్యాచిలర్’ తనకు ఎంత పేరు తెచ్చిందో, తెలుగులో గోట్ అంతటి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కథ విన్నప్పుడు బాగా నవ్వుకున్నానని, సుధీర్ గారు మల్టీ టాలెంటెడ్ అని, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విలన్‌గా నటించిన నితిన్ ప్రసన్న మాట్లాడుతూ, కథ, తన పాత్ర చాలా నచ్చాయని, గొప్ప టీమ్ వర్క్‌తో ఈ సినిమా చేశామని తెలిపారు. కో-ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్