వారణాసి చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా.. మరో తెలుగు సినిమాకు సైన్ చేసినట్లు తెలిసింది.
ప్రియాంక చోప్రా
వారణాసి చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా.. మరో తెలుగు సినిమాకు సైన్ చేసినట్లు తెలిసింది. దీపిక పడుకోన్ స్థానంలో కల్కి2లో ప్రియాంక కనిపించనున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆమెని సంప్రదించగా ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. కల్కి తొలి పార్ట్‌లో నటించిన దీపికా పదుకోన్ పలు కారణాల వలన తప్పుకోవడంతో ఆ స్థానంలో ప్రియాంకని తీసుకుంటున్నట్టు టాక్. సీక్వెల్‌లో కమల్ హాసన్ విలన్‌గా కనిపించి తన నటనతో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేయనున్నాడు. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ప్రియాంక ఇందులో నటించనుందని వస్తున్న వార్తలలో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.