మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో దుల్కర్ హిందీ సినిమాల్లో నటించడం జరిగింది, ఆ సమయంలో ఎదుర్కొన్న అనుభవం నేపథ్యంలో దుల్కర్ ఈ వ్యాఖ్యలు చేయటం జరిగిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
దుల్కర్ సల్మాన్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో దుల్కర్ హిందీ సినిమాల్లో నటించడం జరిగింది, ఆ సమయంలో ఎదుర్కొన్న అనుభవం నేపథ్యంలో దుల్కర్ ఈ వ్యాఖ్యలు చేయటం జరిగిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బాలీవుడ్ గురించి గతంలో కొందరు సౌత్ స్టార్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకి వస్తున్నాయి. ఉత్తరాదిన కేవలం వ్యక్తి పూజ జరుగుతుంది అని ఆరోపించేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దుల్కర్ చేసిన వ్యాఖ్యలు అదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి అనే మాట వాస్తవం. బాలీవుడ్ మొదటి నుంచి కూడా ఆడంబరాలకు పెట్టింది పేరు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏమాత్రం సరిగా లేవు అయినప్పటికీ బాలీవుడ్లో అదే ఆడంబరాల పరిస్థితి కొనసాగుతోంది అనేది దుల్కర్ సల్మాన్ మాటలను బట్టి మరోసారి నిరూపితం అయ్యింది. బాలీవుడ్ ప్రతిభ కంటే ఆడంబరాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని, అందుకే అక్కడ సినిమాలు ఈ మధ్యకాలంలో సరిగా ఆడడం లేదు అనేది ప్రేక్షకుల అభిప్రాయం. బాలీవుడ్ వర్గాల వారు మాత్రం ఆ విషయాన్ని ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు.