దృశ్యం 3 ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.350 కోట్లు?

డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌ లాల్, మీనా జంటగా తెరకెక్కుతున్న దృశ్యం-3 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వరుస షెడ్యూల్స్ ను మేకర్స్ కంప్లీట్ చేస్తున్నారు.

drishyam 3

దృశ్యం 3 

డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌ లాల్, మీనా జంటగా తెరకెక్కుతున్న దృశ్యం-3 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వరుస షెడ్యూల్స్ ను మేకర్స్ కంప్లీట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే దృశ్యం-3 సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. థ్రియేట్రికల్‌, డిజిటల్‌ రైట్స్‌ కలిపి రూ.350 కోట్లు పలికాయని సమాచారం. ఆ విషయాన్ని సినిమా నిర్మాత ఎం. రంజిత్ ఒక ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడించినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అంత మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం మాలీవుడ్ లో ఇదే తొలిసారి కావడం విశేషం. అనేక మలయాళ సినిమాలు హిట్స్ గా నిలిచినా.. భారీ వసూళ్లు రాబట్టినా.. వాటి కంప్లీట్ కలెక్షన్స్ కూడా ఆ నెంబర్ కన్నా తక్కువ అనే చెప్పాలి. దీంతో రిలీజ్ కు ముందే షూటింగ్ దశలోనే దృశ్యం-3 మూవీ కొత్త చరిత్ర క్రియేట్ చేసింది.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్