ప్రశాంత నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా.. డ్రాగన్. దాదాపు రూ.360 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రానుంది. మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
కాజోల్
ప్రశాంత నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా.. డ్రాగన్. దాదాపు రూ.360 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రానుంది. మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కొత్త షెడ్యూల్ మరో వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ కాజోల్ స్పెషల్ రోల్ చేయబోతున్నారట. ఈ మేరకు ప్రశాంత్ నీల్ తాజాగా ఆమెతో చర్చలు కూడా చేశారట. అయితే ఆమెది నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం