దేవర 2పై ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్

కొరటాల శివ దేవర 2 కథ దాదాపు ఫైనల్ చేశారట. తారక్ కూడా దేవర 2 ఎలాగైనా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. దేవర 1ని మర్చిపోయేలా దేవర 2 కంప్లీట్ గా కొత్త సెటప్ తో అదిరిపోయే టర్న్, ట్విస్ట్ లతో ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ. అలా అయితే దేవర 2 కచ్చితంగా మళ్లీ బజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Devara 2

దేవర 2

కొరటాల శివ దేవర 2 కథ దాదాపు ఫైనల్ చేశారట. తారక్ కూడా దేవర 2 ఎలాగైనా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. దేవర 1ని మర్చిపోయేలా దేవర 2 కంప్లీట్ గా కొత్త సెటప్ తో అదిరిపోయే టర్న్, ట్విస్ట్ లతో ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ. అలా అయితే దేవర 2 కచ్చితంగా మళ్లీ బజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దేవర 2 ఉంటుందా లేదా ఈ ప్రశ్న దాదాపు ఆరు నెలల నుంచి చర్చల్లో ఉంది. నిన్న మొన్నటిదాకా దేవర 2 అటకెక్కేసిందన్న వార్తలు రాగా మళ్లీ ఇప్పుడు దేవర 2 కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. మరి ఎన్టీఆర్, కొరటాల శివ దేవర-2 ఏం చేస్తారో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ కన్ ఫ్యూజన్ తో పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం, నెల్సన్ రెడీగా ఉన్నారు. దేవర 2 చేయాలని అనుకున్నా కచ్చితంగా మరో ఏడాది తర్వాతే అది సెట్స్ మీదకు వెళ్తుంది. ఈలోగా దేవర 1 మీద ఉన్న నెగిటివిటీ పోయి కొత్తగా దేవర 2 ని ప్రమోట్ చేసే ప్లాన్ చేస్తున్నారు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్