బాలీవుడ్ నటి దీపిక పడుకోణ్ హారర్ థ్రిల్లర్ జానర్లో సినిమాలు చేయలేదు. ఇప్పుడా సమయం ఆసన్నమైందా? అంటే అవుననే తెలుస్తోంది.
దీపిక పడుకోణ్
బాలీవుడ్ నటి దీపిక పడుకోణ్ హారర్ థ్రిల్లర్ జానర్లో సినిమాలు చేయలేదు. ఇప్పుడా సమయం ఆసన్నమైందా? అంటే అవుననే తెలుస్తోంది. మడాక్ ఫిల్మ్స్ లో అమ్మడు ఏకంగా రెండు హారర్ చిత్రాలకు కమిట్ అయిందని సమాచారం. ఇందులో బెంగాల్ నేపథ్యంలో సాగే హారర్ చిత్రం కథ ఒకటని తెలిసింది. అలాగే యూపీలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా మరో చిత్ర కథ గాను వినిపిస్తోంది. అయితే ఈ రెండింటికి ఇంకా దర్శకులు ఫైనల్ కాలేదు. కథల మాత్రమే రైటర్ల నుంచి సిద్దం చేసి పెట్టుకుంది. వాటిని డీల్ చేయగల సమర్దుల కోసం వెతుకుతున్నారు. మరి ఆ ఛాన్స్ ఎవరు? అందుకుంటారో చూడాలి. మడాక్ ఫిల్మ్స్ కొంత కాలంగా హారర్ థ్రిల్లర్లకు బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. వరుసగా ఆ జానర్లో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు.