చిరు, వెంకీ సాంగ్ గ్లింప్స్ అదిరింది!

టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్‌ పోషిస్తోన్న చిత్రం మన శంకర వర ప్రసాద్‌గారు . అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది.

chiru venky combo song glimpses

ప్రతీకాత్మక చిత్రం

టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్‌ పోషిస్తోన్న చిత్రం మన శంకర వర ప్రసాద్‌గారు . అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్నాడని తెలిసిందే. చిరంజీవి, వెంకటేశ్ కాంబోలో ఓ పాట కూడా ఉండగా షూటింగ్ కొనసాగుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా దీనిపై అధికారిక అప్‌డేట్ వచ్చేసింది. ఈ సాంగ్ గ్లింప్స్ షేర్ చేశారు మేకర్స్‌. బ్యాక్‌ డ్రాప్‌ విజువల్స్‌ ఫైరింగ్ మోడ్‌లో ఉండగా.. చిరు, వెంకీ కలిసి నడుస్తూ థంబ్స్ అప్‌ సింబల్‌ చూపిస్తున్న గ్లింప్స్ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌.. షూటింగ్ కొనసాగుతోంది అంటూ అనిల్ రావిపూడి టీం షేర్ చేసిన అదిరిపోయే సాంగ్‌ గ్లింప్స్ ఇంట్రో నెట్టింట వైరల్ అవుతూ పాటపై అంచనాలు మరింత పెంచేస్తోంది.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్