టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా పేరు సొంతం చేసుకున్న నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ఈ రోజుకు ఏడాది కావస్తోంది.
చందు మొండేటి
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా పేరు సొంతం చేసుకున్న నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ఈ రోజుకు ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. తొలి వివాహ వార్షికోత్సవం కావడంతో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు చందు మొండేటి షేర్ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ‘నిశ్శబ్దాన్ని మించిన శబ్దం లేదు. ఈ విషయంలో మీరు గొప్ప ఉదాహరణ శోభిత అక్కినేని.. మీరు ఒక ఆణిముత్యం’ అంటూ.. చైతూ, శోభిత పెళ్లికి సంబంధించిన ఫోటోని చందు మొండేటి పంచుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.