టాలీవుడ్‌లో సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటోంది భాగ్య శ్రీ బోర్సే.
భాగ్య శ్రీ బోర్సే
టాలీవుడ్‌లో సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటోంది భాగ్య శ్రీ బోర్సే. తెలుగులో మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నెక్స్ట్ కింగ్ డమ్, కాంత రీసెంట్ గా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేసింది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా రిజల్ట్ భాగ్య శ్రీని సంతృప్తి పరచిందనే చెప్పొచ్చు. తన సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం భాగ్యానికి మంచి సంతోషాన్ని ఇచ్చినట్టు ఉంది. అఫ్కోర్స్ ఆంధ్రా కింగ్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉన్నా సినిమాతో భాగ్య శ్రీ వర్క్ సాటిస్ఫ్యాక్టరీగానే అనిపించింది.ఈ సినిమా తర్వాత భాగ్య శ్రీ బోర్స్ అక్కినేని హీరో అఖిల్ తో లెనిన్ సినిమాలో నటిస్తుంది. లెనిన్ సినిమాను మురళి కిషోర్ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలో ముందు అఖిల్ సరసన శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ మధ్యలో ఏమైందో ఏమో శ్రీలీల ప్లేస్ లో భాగ్య శ్రీ ఎంట్రీ ఇచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో కింగ్ డం సినిమా చేసిన భాగ్య శ్రీ మళ్లీ అదే బ్యానర్ లో వస్తున్న లెనిన్ కి సెలెక్ట్ అయ్యింది. లెనిన్ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ లో అక్కినేని నాగార్జున కూడా సహ నిర్మాతగా ఉన్నారు. అఖిల్ లెనిన్ కి భాగ్య శ్రీ ఎంతవరకు ప్లస్ అవుతుందా అన్న డిస్కషన్ మొదలైంది. లెనిన్ టీజర్ తో ఇంప్రెస్ చేసిన అందులో శ్రీలీల హీరోయిన్ గా కనిపించింది. సో భాగ్య శ్రీతో కొత్త టీజర్ లేదా ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ వదలాల్సి ఉంది. అఖిల్ తో భాగ్య శ్రీ జోడీ బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు