నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 'అఖండ 2: తాండవం' రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
అఖండ 2
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న 'అఖండ 2: తాండవం' రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల అనుమతులతో జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది. అనుకున్న ప్లాన్ ప్రకారం జరగాల్సిన ప్రీమియర్ షోస్ విషయంలో ఒక చిన్న ఆటంకం ఎదురైంది. సాంకేతిక కారణాల వల్ల ఈ షోస్ నిలిచిపోయినట్లు మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం వేయాలనుకున్న ప్రీమియర్ షోస్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చింది. టికెట్ ధర రూ. 600 అయినా సరే, ఎలాగైనా సినిమాను ముందుగా చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. అయితే చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇండియాలో జరగాల్సిన ఈ ప్రీమియర్ షోస్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ సంస్థ అధికారికంగా తెలిపింది. ‘మేము మా వంతు ప్రయత్నం చేశాం, కానీ కొన్ని విషయాలు మా చేతుల్లో లేవు. అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ క్యాన్సిలేషన్ కేవలం ఇండియాలోని ప్రీమియర్స్ కు మాత్రమే వర్తిస్తుందని, ఓవర్సీస్ ప్రీమియర్స్ యథావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వెల్లడించారు.