‘సంక్రాంతికి వస్తున్నాం-2’ కోసం మూడో హీరోయిన్

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి రెస్సాన్స్‌ను దక్కించుకుంది.

anil ravipudi

 అనిల్ రావిపూడి

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి రెస్సాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం-2’ తెరకెక్కించే పనిలో నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షూట్‌లో పాల్గొంటుండగా.. అది అయిపోగానే.. ఈ సీక్వెల్‌లో జాయిన్ కానున్నట్లు టాక్. ఇందుకు సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారట.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్