బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పటికప్పుడు సినిమాల్లో బికినీల్లో సందడి చేస్తుంటారన్న విషయం తెలిసిందే. వెకేషన్స్ లో బికినీలు వేసుకుని చిల్ అవుతూ పిక్స్ షేర్ చేసే ముద్దుగుమ్మలు.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా వాటిలో కనిపిస్తుంటారు.
అనన్య పాండే
బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పటికప్పుడు సినిమాల్లో బికినీల్లో సందడి చేస్తుంటారన్న విషయం తెలిసిందే. వెకేషన్స్ లో బికినీలు వేసుకుని చిల్ అవుతూ పిక్స్ షేర్ చేసే ముద్దుగుమ్మలు.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా వాటిలో కనిపిస్తుంటారు. అందుకు సంబంధించిన గ్లింప్సెస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు యంగ్ బ్యూటీ అనన్య పాండే బికినీ లుక్ కూడా అలాగే ట్రెండ్ అవుతోంది. తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ మూవీలో బికినీలో సందడి చేయనున్న అమ్మడికి సంబంధించిన లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. లుక్ అదిరిపోయిందని, సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, సినిమాలో హీరోయిన్ బికినీ వేసుకుంటే.. థియేటర్స్ కు ఆడియన్స్ వెళ్లి చూస్తారంటే పొరపాటే. ఎవరో కొందరు వెళ్లి లుక్స్ ను ఎంజాయ్ చేస్తారు. కానీ అందరూ తరలివెళ్లాలంటే.. సినిమాలో కంటెంట్ ఉంటేనే.. పాజిటివ్ టాక్ వస్తేనే సాధ్యమవుతుందంటూ మరో వర్గం కామెంట్లు చేస్తోంది.