ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి.
అనగనగా ఒక రాజు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా తాను ఓ మూవీ చేస్తున్నాడు. అనగనగా ఒక రాజు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మారి అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీ ఎప్పుడో రిలీజవాల్సింది కానీ మధ్యలో నవీన్ కు యాక్సిడెంట్ అవడంతో సినిమా షూటింగ్ లేటవడంతో మూవీ వాయిదా పడి పండక్కి షెడ్యూలైంది. ఇప్పుడీ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. మేకర్స్ ప్రస్తుతం ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారని, ఇది కాకుండా మరో సాంగ్ షూట్ పెండింగ్ ఉందని, ఆ సాంగ్ తో సినిమా మొత్తం షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.