1990లలో ఖిలాడీ అక్షయ్ కుమార్ - శిల్పాశెట్టి జంట ప్రేమాయణం నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచేది. ఈ జంట తొందర్లోనే పెళ్లితో ఓ ఇంటివాళ్లు అవుతున్నారని కూడా హిందీ మీడియాలో కథనాలొచ్చాయి.
అక్షయ్-శిల్పాశెట్టి
1990లలో ఖిలాడీ అక్షయ్ కుమార్ - శిల్పాశెట్టి జంట ప్రేమాయణం నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచేది. ఈ జంట తొందర్లోనే పెళ్లితో ఓ ఇంటివాళ్లు అవుతున్నారని కూడా హిందీ మీడియాలో కథనాలొచ్చాయి. అయితే చివరికి అక్షయ్ కుమార్ తో శిల్పాశెట్టి లవ్ బ్రేక్ అయింది. అతడు మరో హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లాడగా, శిల్పా శెట్టి ది గ్రేట్ బిజినెస్ మేన్, బాంబే డైయింగ్ యజమాని అయిన రాజ్ కుంద్రాను పెళ్లాడారు. ఎవరి లైఫ్ లో వారు సెటిలయ్యారు. అయితే శిల్పా శెట్టితో అక్షయ్ పెళ్లి జరగకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? అంటే.. తన కుమార్తె రక్షణ కోసం ఏంటి భరోసా? అంటూ శిల్పా శెట్టి తల్లి బాగా ఇన్వాల్వ్ అయ్యారట. తమ కుమార్తెను పెళ్లాడాలంటే కండిషన్స్ అప్లయ్ అనడంతో అక్షయ్ కి చిర్రెత్తుకొచ్చి వెంటనే బ్రేకప్ అయిపోయాడని కూడా కథనాలొచ్చాయి. ఇదే విషయాన్ని దర్శకనిర్మాత సునీల్ దర్శన్ స్పష్టం చేశాడు. శిల్పా శెట్టి తల్లిదండ్రులు ఆ రోజు ఆ కండిషన్లు పెట్టకపోయి ఉంటే ఆమె జీవితం వేరొక మలుపు తీసుకునేది అని కూడా అన్నారు.