ప్రశాంత్ నీల్‌తో అఖిల్ మూవీ!?

అక్కినేని అఖిల్‌కు ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పెద్ద హిట్ దక్కలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ చిత్రానికి ఎంతో కష్టపడినా అనుకున్న ఫలితం రాలేదు.

prashanth neel akhil

ప్రశాంత్ నీల్‌ అఖిల్

అక్కినేని అఖిల్‌కు ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పెద్ద హిట్ దక్కలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ చిత్రానికి ఎంతో కష్టపడినా అనుకున్న ఫలితం రాలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని ప్రస్తుతం ‘లెనిన్‌’గా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. మురళీ కిశోర్‌ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత అఖిల్.. పాన్ ఇండియా డైరెక్టర్‌ అయిన ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయబోతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ప్రశాంత్‌ నీల్‌తో అఖిల్ సమావేశం కావడంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే చిత్రబృందం నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్