అఖండ 3 టైటిల్.. జై అఖండ!?

అఖండ 2-తాండవం సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై ట్రైలర్, టీజర్లు, మ్యూజిక్‌తోనే అంచనాలు అమాంతం పెరిగాయి.

akhanda 3

అఖండ 3 

అఖండ 2-తాండవం సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై ట్రైలర్, టీజర్లు, మ్యూజిక్‌తోనే అంచనాలు అమాంతం పెరిగాయి. డిసెంబర్ 4 నుంచే పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేయడంతో హైప్ మరింత రెట్టింపు అయ్యింది. అయితే, అఖండ 2 ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు అఖండ 3 కూడా రావొచ్చు అని పరోక్షంగా ఇచ్చిన హింట్ ఇప్పుడు నిజం అని అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.థ‌మన్.. బోయపాటి శ్రీను, చిత్ర యూనిట్‌తో దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో వారి వెనుక ఉన్న డిజిటల్ స్క్రీన్‌పై పెద్ద అక్షరాల్లో ‘జై అఖండ’ అని కనిపించింది. దాంతో ‘అఖండ 3 టైటిల్ ఇదే.. జై అఖండ కన్ఫర్మ్!’ అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్