ఏపీలో అఖండ 2 టికెట్ రేట్లు పెంపు

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ 2 ఈ నెల 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

akhanda2

అఖండ 2 

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ 2 ఈ నెల 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాష్ట్రంలో డిసెంబర్ 4న రాత్రి బెనిఫిట్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ బెనిఫిట్ షోకు టికెట్ ధరను రూ.600/- గా ఫిక్స్ చేశారు. ఇక డిసెంబర్ 5 నుండి 10 రోజుల పాటు అఖండ 2 చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్లలో మల్టీప్లెక్స్‌లు రూ.100/-, సింగిల్ స్క్రీన్ థియేటర్లు రూ.75/- చొప్పున టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు సదరు థియేటర్లకు అనుమతినిచ్చింది ఏపీ సర్కార్. దీంతో ‘అఖండ 2’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్