డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న అఖండ 2 సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి.
అఖండ 2
డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న అఖండ 2 సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేయగా, తాజాగా సినిమా నిడివిని 2 గంటల 45 నిమిషాల రన్ టైమ్‌ను లాక్ చేశారట. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలుస్తాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పే సన్నివేశాలు, దానికి సంబంధించిన డైలాగులు బాలయ్య మార్క్ లో ఉంటాయట. మొదటి పార్ట్ తో పోలిస్తే, ఇందులో చూపించే ప్రపంచం, విజువల్స్ కొంచెం కొత్తగా, ఫ్రెష్‌గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.