అఖండ 2 విడుదల క్యాన్సిల్

బాలయ్య నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది. అంతకుముందు గురువారం రాత్రి ప్లాన్ చేసిన అఖండ 2 ప్రీమియర్స్ రద్దు కాగా, రెగ్యులర్ షోలను కూడా వాయిదా వేశారు.

akhanda 2

అఖండ 2 

నిర్మాతల సంచలన ప్రకటన

హైదరాబాద్, డిసెంబర్ 4 (ఈవార్తలు): బాలయ్య నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది. అంతకుముందు గురువారం రాత్రి ప్లాన్ చేసిన అఖండ 2 ప్రీమియర్స్ రద్దు కాగా, రెగ్యులర్ షోలను కూడా వాయిదా వేశారు. సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అర్ధరాత్రి సోషల్ మీడియా వేదికగా 14 రీల్స్ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. ‘అనివార్య కారణాల వల్ల అఖండ 2 షెడ్యూల్‌ ప్రకారం విడుదల కావడం లేదు. ఈ విషయం పట్ల ఏం ఎంతగానో చింతిస్తున్నాం. ఈ క్షణం మాకు చాలా బాధాకరమైనది. ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము అర్థం చేసుకుంటాం. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. ఈ నిర్ణయం పట్ల కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తాం’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్