ఓ సుకుమారిగా.. ఐశ్వర్య రాజేశ్-తిరువీర్

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ కీలకపాత్ర పోషిస్తున్న కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘మసూద’, ‘పరేషాన్’,’ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న చిత్రంలో నటిస్తున్నారు.

 o sukumari

ఓ సుకుమారి

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ కీలకపాత్ర పోషిస్తున్న కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘మసూద’, ‘పరేషాన్’,’ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా జాతీయ అవార్డు గ్రహీత, నటి ఐశ్వర్య రాజేశ్ నటించనుంది. ఓ సుకుమారి అంటూ రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల కాబోతుంది. గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను గంగ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్వ‌ర రెడ్డి మూలి నిర్మిస్తుండ‌గా భ‌ర‌త్ ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌గా ఆక‌ట్టుకుంటుంది.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్