హీరోయిన్ ఎవరైనా కథ, అందులో తన పాత్ర తెలియకుండా ఏ సినిమాకు కమిట్ అవ్వదు. అలా కమిట్ అయిందంటే అది దర్శకులపై తనకున్న నమ్మకం మాత్రమే కారణమవుతుంది.
అతిది రావు హైదరీ
హీరోయిన్ ఎవరైనా కథ, అందులో తన పాత్ర తెలియకుండా ఏ సినిమాకు కమిట్ అవ్వదు. అలా కమిట్ అయిందంటే అది దర్శకులపై తనకున్న నమ్మకం మాత్రమే కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో దర్శక, నటుల మధ్య ఉన్న ర్యాపో కారణంగానూ ఇలాంటి సన్నివేశం కనిపిస్తుంది. తాజాగా హైదరాబాద్ బ్యూటీ అతిది రావు హైదరీ కూడా అంతేనంటోంది. పాత్రల కంటే నిర్మాతలు, దర్శకులే తనను ఎక్కువగా ఉత్సాహపరుస్తారంది. ఎందుకంటే తానెప్పుడు దర్శకుల బిడ్డనే అంటుంది. వాళ్ల అభిరుచుకి తగ్గట్టు ఉండటమే తన పని అంది. పాత్ర గురించి తెలుసుకోనంది. ఏం జరుగుతుందో తెలియని చీకటి గదిలోకి వెళ్తోన్న చిన్న పిల్లాడిలా తాను ఉండాల నుకుంటుంటానంది. తాను ఏ పాత్ర ఎంచుకున్నా? అందులో సీతాకోక చిలుకలా ఎగరాలనుకుంటుంటానంది. ఏ సినమాకు సంతకం చేసినా? పాత్రల పరంగా అలా ఉండాలి? ఇలా ఉండాలి? అని ఎలాంటి సలహాలు ఏ దర్శక, రచయితకు ఇవ్వనని, వారు అప్రోచ్ అయ్యే విధానంతోనే సగం కమిట్ మెంట్ జరిగిపోతుందంది.