చంపేస్తారని భయపడ్డా: అదా శర్మ
అదా శర్మ
1920 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే, ది కేరళ స్టోరీ సినిమా తర్వాత, బస్తర్ ది నక్సల్ స్టోరీ కూడా చేసిందీ బ్యూటీ. ఆ సినిమా కూడా ఒక సంచలనంగా మారింది. అయితే ఆ సినిమా విడుదలైనప్పుడు ఆదాశర్మకు చాలా బెదిరింపులు వచ్చాయట. భయం గుప్పిట్లో బతికానని చెప్పింది. ‘దేశంలో సగం మంది నన్ను చంపాలని అనుకున్నారు. మిగతా సగం మంది నాపై ప్రశంసలు కురిపించారు. వారంతా నన్ను రక్షించారు’ అని చెప్పింది. స్క్రిప్ట్ ఎంచుకునే విధానంలో ఛాలెంజింగ్‌గా ఉండాలని చెప్పుకొచ్చింది. పాత్రలో బలమైన ఎమోషన్ లేకపోతే నచ్చదని, అలానే యాక్షన్ సీక్వెన్స్ ఉండేటట్లు చూసుకుంటానని చెప్పింది.